సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న మహర్షి చిత్రం యొక్క విడుదల తేదీ మారింది. మొదటగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు కానీ కుదురకపోవడంతో అదే నెల 25 న విడుదలచేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ డేట్ కు కూడా విడుదలకావడం లేదు. అదే సమయంలో ఎన్నికలు కూడా ఉండడంతో సినిమా ని విడుదల చేస్తే నష్టం జరిగే అవకాశం ఉండడంతో తాజాగా ఈ చిత్రాన్ని మే 9న విడుదలచేయనున్నారు.
వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మహేష్ బిజినెస్ మేన్ గా అలాగే రైతు పాత్రలో కనిపించనున్నాడు . దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు , పివిపి , అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా అల్లరి నరేష్ , సాయి కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Next
This is the most recent post.
Previous
Older Post

0 comments:

Post a Comment

 
Top