రివ్యూ : లెజెండ్ 
సినిదునియా రేటింగ్ :3.25/5
బ్యానర్ :14 రీ ల్స్
దర్శకత్వం :బోయపాటి శ్రీను 
నిర్మాత :అనిల్ సుంకర ,రామ్ ఆచంట ,గోపి ఆచంట 

బాలకృష్ణ ,బోయపాటి శ్రీను కాంబినేషన్ లో గతం లో వచ్చిన సింహ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా  నిలిచిందో మనకు తెలిసిందే. మళ్లీ వారి ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన లెజెండ్ అభిమానుల అంచనాలను అందుకుంది. 25 సంవత్సరాలు హీరో గా చేసిన జగపతి బాబు ఈ సినిమా లో ప్రతి నాయక పాత్రను పోషించాడు . 
సినిమా లోకి వెళ్తే ఇంట్లో కారం , ఒంట్లో అహంకారం లేకుండా బతకలేననే జితేందర్ (జగపతి బాబు )ముఖ్యమంత్రి పదవి పై ఆశలు పెంచుకుంటాడు . అలాంటి జితేందర్ ఒక ఊరికి పెళ్లి చూపులకి వెళ్లి వివాదం లో చిక్కుకుంటాడు . ఆ  ఊరి పెద్ద (సుమన్ ) జితేందర్ ను నష్టపరిహారం ,క్షమాపణ చెప్పమని అదేశిస్థాడు . ఆ ఊరి పెద్ద నిర్ణయాన్ని దిక్కరించిన జితేంద్ర  ఊరి పెద్ద భార్య (సుహాసిని ), కుమారుడు కృష్ణ (బలకృష్ణ ) ను కిడ్నాప్ చేస్తాడు . కిడ్నాప్ వ్యవహారం లో తల్లి చనిపోవడం తో కృష్ణ జితేంద్ర తండ్రి ని ,అనుచరులని చంపేస్తాడు . ఈ సంఘటన తో కృష్ణ ని పై చదువుల కొరకు లండన్ పంపిస్తారు . పెళ్లి కోసం మళ్ళి తిరిగివచ్చిన కృష్ణ కు జితేందర్ అనుచరులకు అనుకోని సంఘటన లు ఎదురవుతాయి . అనంతరం జితేంద్ర అనుచరులు కృష్ణ పై కాల్పులు జరుపుతారు .  దాంతో కృష్ణ పరిస్తితి విషమంగా మారుతుంది . ఈ సంఘటన తరువాత సినిమా లో పెద్ద ట్విస్ట్ ఉంటుంది .ఇంటర్వెల్ ముందు వచ్చే ఈ ట్విస్ట్ సినిమాకు హైలెట్ గా చెప్పుకోవచ్చు . ఆ ట్విస్ట్ ఏమిటి అన్నది తెరపై చూడాల్సిందే ... 

ఈ సినిమా లో ఇద్దరు హీరోయిన్ లు ఉన్న వారి పాత్రలకు పెద్ద స్కోప్ లేదు . సినిమాలో బాలకృష్ణ డైలాగ్ డెలివరీ , బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది . సెకండ్ హాఫ్ లో డైలాగ్ లు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విదంగా ఉన్నాయి.  ప్రతినాయక పాత్ర లో జగపతి బాబు ఆకట్టుకున్నాడు . బ్రహ్మానందం ,హీరో ,హీరోయిన్ ల మద్య కామెడీ సన్నివేశాలు బాగున్నాయి . దేవి శ్రీ ప్రసాద్ సంగీతం గత సినిమాలతో పోలిస్తే కొంత వరకు తగ్గిందే అని చెప్పాలి .
రానున్న పక్షం రోజుల్లో ఎ సినిమాలు లేకపోవడం తో ఈ సినిమా వసూళ్ళ పరంగా దూసుక పోతుంది అనడం లో సందేహం లేదు  . 


0 comments:

Post a Comment

 
Top