రివ్యూ : రాజ రాణి 
సినీ దునియా రేటింగ్ :3/5
బ్యానర్ : ఏ ఆర్ మురగదాస్ ప్రొడక్షన్ 
తారాగణం :ఆర్య,నయనతార,జై,నజ్రియా నజిమ్,సత్య రాజ్ 
దర్శకత్వం : అట్లి 
నిర్మాత :మురగదాస్

శంకర్ వద్ద సహాయకుడిగా పని చేసిన అట్లి దర్శకత్వం చేసిన రాజ రాణి సినిమా మురుగదాస్ నిర్మాణ సారథ్యం లో శుక్రవారం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథ లోకి వెళ్తే ప్రతి లవ్ ఫెయిల్యూర్ తరువాత మళ్ళి  లైఫ్ ఉంటుంది , మళ్ళి లవ్ ఉంటుంది అనే విషయాన్ని దర్శకుడు ప్రతి  ప్రేక్షకుని మనసుకు హత్తుకునే విదంగా తెరకెక్కించాడు . సినిమా లోకి వెళ్తే ఆర్య , నయనతార ఇద్దరు మొదట లవ్ లో ఫెయిల్యూర్ అవుతారు .ఒకరి పై ఒకరికి ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్న వీరు కలిసి బతకడానికి చాల ఇబ్బందులు పడతారు. తరువాత ఒకరి గతం ఒకరికి తెలియడం తో ఇద్దరి లో మార్పు వచ్చి చివరికి తమ ప్రేమని తెలుసుకుని ఎలా కొత్త జీవితం ప్రారంబిస్తారు అనేది కథ . 

రాజ రాణి సినిమా తమిళ్ అనువాదం కావడం తో తెలుగు నేటివిటి చానా వరకు లోపించింది .  జి . వి. ప్రకాష్ అందించిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకునేల లేవు . సినిమా లో నయనతార తనను విడిచి పోయిన ,ఇష్టం లేని బర్త  మద్య నలిగిపోయే క్యారెక్టర్ లో చాలా బాగా నటించింది . నయన తార తండ్రి పాత్ర లో సత్య రాజ్ ఆకట్టుకున్నారు . హీరో స్నేహితుడిగా సంతానం నవ్వించారు . తన పాత్రలో ఆర్య ఇమిడి పోయాడు . ప్లాష్ బ్యాక్ లో జై ,నజ్రియా ఇద్దరు బాగా నటించారు . 

సినిమా చూసిన ప్రేక్షకులకి ఓ మంచి సినిమా చుసామనే అనుభూతి మిగులుతుంది . 






0 comments:

Post a Comment

 
Top