రివ్యూ : రేస్ గుర్రం 
సినీ దునియా రేటింగ్ : 3.5/5
బ్యానర్ : లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ 
తారాగణం : అల్లు అర్జున్ ,కిక్ శ్యాం,శ్రుతి హసన్ ,ప్రకాష్ రాజ్ 
సంగీతం : ఎస్ .ఎస్.తమన్
దర్శకత్వం : సురేందర్ రెడ్డి 
నిర్మాత : నల్లమలపు శ్రీనివాస్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ,దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన రేస్ గురం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది . కథ లోకి వెళ్తే రామ్ , లక్ష్మణ్  ఇద్దరు అన్నదమ్ములు . నీతి నిజాయితి ఉన్న పోలీస్ ఆఫీసర్ రాము (కిక్ శ్యాం ), ఎప్పుడు జులాయి గా తిరిగే లక్కి (అల్లు అర్జున్ ) ల కి క్షణం కూడా పడదు . ఎప్పుడు ఏదో ఒక కారణం తో గొడవ పడుతుంటారు . ఈ క్రమం లో లక్కి స్పందన (శ్రుతి హసన్ ) తో లవ్ లో పడతాడు . ఇది ఎ మాత్రం నచ్చని రామ్ ఒక దశ లో వీరి ప్రేమకు బ్రేక్ వేసేందుకు ప్లాన్ చేస్తాడు . ఈ విషయం తెలిసిన లక్కి రామ్ కి గుణ పాఠం చెప్పాలని అతని పోలీస్ కార్ ను దొంగిలిస్తాడు . లాక్కి దొంగతనం చేసిన కారు లో ఉన్నది రామ్ అను కొని రాజకీయవేత్త గా మారిన రౌడి శివారెడ్డి వర్గం ఎట్టాక్  చేస్తారు . ఆ దాడి నుండి లక్కి తప్పించుకుంటాడు . అసలు శివ రెడ్డి కి , రామ్ కి ఉన్న గొడవ ఏంటి , లక్కి , స్పందన ల ప్రేమను రామ్ ఎందుకు బ్రేక్ చేయాలనుకున్నాడు , రామ్ ,లక్కి ల మద్య మనస్పర్థలు ఎలా తొలిగి పోయాయి, అన్న దమ్ములు ఇద్దరు శివారెడ్డి ని ఎలా ఎదిరిస్తారు అన్నదే కథ. 
లక్కి పాత్రకు అల్లు అర్జున్ కరెక్ట్ గా సూట్ అయ్యాడు. రేస్ గుర్రం సినిమా లో శ్రుతి హసన్ గ్లామర్ పరంగా ఆకట్టుకుంటుంది .ఈ సినిమా లో కిక్ శ్యాం లవర్ గా సలోని ఆకట్టుకుంటుంది కాని సలోని పాత్రకు పెద్ద స్కోప్ లేదు. కిక్ శ్యాం పోలీస్ ఆఫీసర్ గా , అల్లు అర్జున్ అన్నయ్య గా పరవాలేదనిపించాడు . విలన్ గా బొజ్ పూరి నటుడు రవి కిషన్ శివారెడ్డి పాత్రలో తన పర్ది మేరకు నటించాడు .
రేస్ గుర్రం సినిమా లో బ్రహ్మానందం కామెడీ చాలా బాగుంది.కిల్ బిల్ పాండే గా సినిమా చివర లో హంగామా చేశాడు. శ్రీనివాస రెడ్డి , తాగుబోతు రమేష్ పరవాలేదనిపించారు. హీరోయిన్ తండ్రి గా ప్రకాష్ రాజ్ తనదైన స్టైల్ లో నటించాడు .
 రేస్ గుర్రం కథ పాతదే ఐన తనదైన స్టైల్ స్క్రీన్ ప్లే తో సురేందర్ రెడ్డి ప్రేక్షకులను రెండున్నర గంటల పాటు కట్టి పడేశాడు.గత సినిమా ల తో పోలిస్తే ఎస్ . ఎస్ .థమన్ సంగీతం కొంత వరకు బాగుంది. చివరగా ఈ రేస్ గుర్రం ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది.

0 comments:

Post a Comment

 
Top