సినీ దునియా రేటింగ్  : 2/5
 దర్శకత్వం : ఎ. కరుణాకరన్
 నిర్మాత : ఎం. సుధాకర్ రెడ్డి – నిఖిత రెడ్డి
  సంగీతం : అనూప్ రూబెన్స్
                                                               
‘ఇష్క్’,’గుండెజారి గల్లంతయ్యిందే’, ‘హార్ట్ ఎటాక్’ లాంటి రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న లవర్ బాయ్ నితిన్ రొమాంటిక్ ఎంటర్టైనర్స్ తీయడంలో స్పెషలిస్ట్ అయిన కరుణాకరన్ తో కలిసి చేసిన సినిమా ‘చిన్నదాన నీకోసం’. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కథ :
తన స్టడీస్ ని ఫినిష్ చేసుకున్న నితిన్(నితిన్) రిచ్ కిడ్ కావడం వలన తన లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తుంటాడు. ఆపదలో ఉన్న ఓ అమ్మాయిని కాపాడడంతో హైదరబాద్ లో ఫేమస్ అయిన రెడ్డి(నాజర్) నితిన్ కి ఫ్యాన్ అయిపోతాడు. అదే సమయంలో నితిన్ నందిని(మిష్తి)ని చూసి ప్రేమలో పడతాడు. మొదట్లో నితిన్ ని దూరం పెట్టిన నందిని నితిన్ కి రెడ్డి బాగా క్లోజ్ అని తెలియడం వల్ల తనతో ఫ్రెండ్ షిప్ చేస్తుంది. పరిస్థితులను బట్టి నందిని కూడా తనని ప్రేమిస్తుందని నితిన్ అనుకుంటాడు. అలా నితిన్ వల్ల రెడ్డి తో పరిచయం పెంచుకున్న నందిని ఒకరోజు నితిన్ కి తెలియకుండా రెడ్డిని తీసుకొని బార్సెలోనా వెళ్ళిపోతుంది. తనని మోసం చేసి వెళ్ళిపోయిందని తెలుసుకున్న నితిన్ షాక్ అవుతాడు. కట్ చేస్తే మన హీరో నితిన్ కూడా బార్సెలోనా వెళ్తాడు. అప్పుడే నందిని చైతన్యని పెళ్లి చేసుకోనుందని తెలుస్తుంది. అప్పుడు నితిన్ ఏం చేసాడు.? ఎలా తన ప్రేమని దక్కించుకున్నాడు.? అలాగే రెడ్డికి దగ్గర అవ్వడానికి నందిని నితిన్ ని ఎందుకు వాడుకుంది.? అసలు నందినికి రెడ్డికి ఉన్న సంబంధం ఏమిటి.? అన్నది మీరు వెండితెరపైనే చూడాలి.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ గా నిలిచిన వాటిలో ముందుగా చెప్పాల్సినవి..  సినిమాటోగ్రఫీ, అనూప్ రూబెన్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరియు నితిన్, మిష్తిల పెర్ఫార్మన్స్. ఆండ్రూ బార్సెలోనా అందాలను అంతకంటే అందంగా తన కెమెరాతో షూట్ చేసి మనకు చూపించాడు. ఇకపోతే రొమాంటిక్ సీన్స్ లో అనూప్ అందించిన బ్యాక్ గ్ర్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి చాలా హెల్ప్ అయ్యింది.
ఇక లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న నితిన్ విషయానికి వస్తే నితిన్ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ ఈ సినిమాకి మేజర్ హైలైట్ అయ్యింది. డాన్సులు కూడా బాగా వేసాడు. పెర్ఫార్మన్స్ నుంచి లుక్స్ విషయానికి వస్తే ప్రతి సినిమాలో ఎదో ఒక వేరియేషన్ చూపిస్తున్న నితిన్ ఇందులో కూడా ఓ న్యూ స్టైలిష్ లుక్ లో కనిపించాడు. నితిన్ హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్ పాత్రకి తగ్గట్టుగా ఉన్నాయి. నితిన్ కి జోడీగా నటించిన బాలీవుడ్ భామ మిష్తి తన మొదటి సినిమాతోనే తెలుగు కుర్రాళ్ళ మనసును దోచుకుంది. 
తాగుబోతు రమేష్ చేసింది చిన్న పాత్రే అయినా ప్రేక్షకులను బాగా నవ్వించాడు. అలాగే నితిన్ కి ఫ్రెండ్లీ ఫాదర్ పాత్ర చేసిన సీనియర్ నరేష్ చేసే కామెడీ కూడా బాగుంది. నాజర్ పెర్ఫార్మన్స్ కూడా సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. ఇకపోతే సినిమా ఫస్ట్ హాఫ్ నాలుగు కామెడీ సీన్స్, ఎంటర్టైనింగ్ గా ఉండే రొమాంటిక్ టీజింగ్ సీన్స్ మరియు బ్యూటిఫుల్ సాంగ్స్ తో సరదాగా సాగిపోతుంది. హర్షవర్ధన్ రాసిన డైలాగ్స్ బాగున్నాయి. కామెడీ డైలాగ్స్ మాత్రం చాలా చోట్ల బాగా పేలాయి.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాకి  సెకండాఫ్  పెద్ద డ్రా బ్యాక్ అయ్యిందని చెప్పాలి. ఎందుకంటే మంచి ఇంటర్వల్ బాంగ్ తర్వాత వచ్చే మొదటి పది నిమిషాల్లోనే అసలు కథ మొత్తం చేసేసారు. అక్కడి నుంచి మరో పది నిమిషాల్లో ముగించేయాల్సిన పాయింట్ ని సాగదీసి ఒక గంట తీసాడు. దానికోసం అనవసరం అయిన కామెడీ సీన్స్ రాసుకొని సినిమాని బోర్ కొట్టించేసారు. ముఖ్యంగా మధు – జోష్ రవితో రాసుకున్న గే కామెడీ సీన్స్ ఆడియన్స్ కి చిరాకు తెప్పిస్తాయి.  ఇకపోతే క్లైమాక్స్ ని కూడా సరిగా డీల్ చెయ్యలేదు. ఏదో హడావిడిగా ముగించేసినట్టు అనిపించడమే కాకుండా సరైన క్లారిటీ లేదనిపిస్తుంది.
సాంకేతిక విభాగం :
అనూప్ రూబెన్స్ అందించిన పాటలు తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని పెద్ద హిట్ అయ్యాయి. సో అంతలా హిట్ అయిన పాటలు విజువల్ గా ఇంకా పెద్ద హిట్ అయ్యేలా కరుణాకరన్ తీసాడు. పాటలు కాకుండా రొమాంటిక్ సీన్స్ కి అనూప్ అందించిన నేపధ్య సంగీతం ఆడియన్స్ ని కట్టి పడేసింది. ఇక చెప్పుకోవాల్సింది హర్ష వర్ధన్ డైలాగ్స్.. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, మనం సినిమాల తర్వాత ఈ సినిమాకి కూడా చాలా సింపుల్ గా ఉంటూ ఆడియన్స్ ని నవ్వించేలా, కవ్వించేలా ఉండే డైలాగ్స్ రాసి మెప్పించాడు. 
తీర్పు :
 వరుసగా నితిన్ చేసిన రొమాంటిక్ ఎంటర్టైనర్స్ అన్నీ సూపర్బ్ గా ఉంటున్నాయి, ఇది కూడా అదే మాదిరిగా సూపర్బ్ గా ఉంటుందని ఆశించి వెళ్ళకండి అలా వెళ్ళారు అంటే మీకు నిరాశే మిగులుతుంది. 

0 comments:

Post a Comment

 
Top