స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి ఆస్థాన ఛాయాగ్రామకుడిగా సెంథిల్ పాపులరైన సంగతి తెలిసిందే. రికార్డ్ హిట్ సినిమాలు మగధీర బాహుబలి రెండు చిత్రాలకు సెంథిల్ సినిమాటోగ్రాఫర్.  ఈ సినిమాలతో పాటు రాజమౌళితో పలు విజయవంతమైన సినిమాలకు పనిచేశాడు. ఇటీవలి బాహుబలి  ఘనవిజయం తర్వాత అటు బాలీవుడ్ లోనూ సెంథిల్ పేరు మర్మోగిపోయింది. బాహుబలి సినిమాటోగ్రాఫర్ అంటూ అతడికి ప్రత్యేక గుర్తింపు దక్కింది. అయితే ఇప్పుడు అదే సెంథిల్ కి ఓ మెగా ఆఫర్ ని తెచ్చిపెట్టింది.  ఏకంగా బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్  సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. 

ప్రస్తుతం షారూక్-కాజోల్ జంటగా నటిస్తున్న దిల్వాలే యూనిట్ హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలోనే చిత్రీకరణ సాగిస్తోంది. ఇక్కడ ఓ పాటను కూడా చిత్రీకరిస్తున్నారు. దీనికి సెంథిల్ సినిమాటోగ్రపీ అందిస్తున్నాడు. పూర్తి సినిమాకి సినిమాటోగ్రఫీ ఇచ్చేంత తీరిక సెంథిల్ కి లేదు. అందుకనే ఇలా పార్ట్ టైమ్ జాబ్ తనని వెతుక్కుంటూ వచ్చింది. బాహుబలి 2 నవంబర్ నుంచి ఆన్ సెట్స్ కు వెళుతుంది. అంతవరకూ ఖాళీగా కూచోవడం ఎందుకు? అనుకున్నాడో ఏమో సెంథిల్ ఇలా ప్లాన్ చేశాడని అంటున్నారు. 

అయినా రోహిత్ శెట్టి లాంటి స్టార్ డైరెక్టర్ తో బాలీవుడ్ బాద్ షాతో పనిచేస్తున్నాడంటే అది ఎంతో పెద్ద గుర్తింపు. సెంథిల్ కి ఇది రియల్ బొనాంజా ఆఫర్. మునుముందు షారూక్ రోహిత్ శెట్టిలతో ఓ పూర్తి స్థాయి సినిమాకి ఛాయాగ్రాహకుడిగా పనిచేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

0 comments:

Post a Comment

 
Top