రివ్యూ : రౌడీ
సినీ దునియా రేటింగ్ : 3/5
బ్యానర్ : ఏ.వి పిక్చర్స్ ,24 ఫ్రేమ్స్
తారాగణం :మోహన్ బాబు,జయసుధ,విష్ణు,పరచూరి వెంకటేశ్వర్ రావు ..
దర్శకత్వం :రామ్ గోపాల్ వర్మ
నిర్మాత:విజయ్ కుమార్ ,గజేంద్ర నాయుడు ,పార్థసారథి నాయుడు
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ , మంచు మోహన్ బాబు కలయిక లో వచ్చిన రౌడీ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది . రాయలసీమ నేపథ్యం లో సినిమా లు తీయడం రాంగోపాల్ వర్మ కు వెన్న తో పెట్టిన విద్య. రాయలసీమ లో న్యాయాన్ని ,ధర్మాన్ని కాపాడుతూ మోహన్ బాబు (అన్న గారు ) ప్రజల కు అండగా ఉంటాడు . అన్న గారి ఇద్దరు కొడుకుల లో పెద్ద వాడు చెడ్డ పనులు చేస్తూ తండ్రి గారి కి చెడ్డ పేరు తీసుక రావాలని చూస్తాడు .తల్లి లక్ష్మి (జయసుధ ) పెద్ద కొడుకుని మార్చాలని చూసిన తను మారకుండా తండ్రి పై ద్వేషం పెంచుకుంటాడు . చిన్న కొడుకు కృష్ణ (విష్ణు ) తండ్రి మాట జవదాటకుండా తండ్రి బాట లో నడుస్తాడు. ఇదే సమయం లో కొందరు స్వార్థపరులు నందవరం ప్రాజెక్ట్ కట్టడానికి పతకం రచిస్తారు . నంద వరం ప్రాజెక్ట్ వళ్ళ 40 గ్రామాల ప్రజలు నిరాశ్రయులు అవుతారని గ్రహించిన అన్న గారు దానిని అడ్డుకుంటారు . ఎలాగైనా ఆ ప్రాజెక్ట్ కట్టాలని కొందరు అన్న గారి పెద్ద కొడుకు తో కలసి అన్న గారిని చంపాలని పథకం రచిస్తారు ..అన్న గారు తన ప్రధాన అనుచరుని కూతురు పెళ్లి కి వెళ్తుండగా అన్న గారి పై దాడి చేస్తారు . ఈ దాడి లో తీవ్రంగా గాయపడిన అన్నగారిని విష్ణు కాపాడి హాస్పిటల్ లో చేరుస్తాడు .
అనంతరం మల్లి హాస్పటల్ లో అన్న గారి పై హాత్య యత్నం జరుగుతుంది . తరువాత ఎలాగైనా అన్న గారిని చంపాలనుకున్న విలన్ లు అన్న గారి పెద్ద కొడుకుతో అన్న గారిని చంపించాలని ప్లాన్ చేస్తారు . అందుకు సమ్మతించిన అన్న గారి పెద్ద కొడుకు అన్న గారిని చంపడానికి హాస్పిటల్ వెళ్తాడు . ఈ ప్రయత్నం లో అన్న గారి కి బదులు జయసుధ చనిపోతుంది . ఈ విషయం తెలుసుకున్న విష్ణు తన తండ్రి ని చంపడానికి చూసిన వారిని , అందుకు సహకరించిన వారిని అంతమొందిస్తాడు .
రౌడి మూవీ లో మోహన్ బాబు ,విష్ణు ,జయసుధ తమ పరిధి మేరకు నటించారు .సాయి కార్తిక్ మ్యూజిక్ ఆకట్టు కునేల లేదు. గంగోత్రి విశ్వనాధ్ మాటలు ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి .రామ్ గోపాల్ వర్మ సదా సీదా కథను ఎన్ను కోవడం సినిమా కి మైనస్ పాయింట్ .రామ గోపాల్ వర్మ సినిమా అంటే ఏదో ఉహించుకుని వెళ్ళిన ప్రేక్షకులకు నిరాశే మిగులుతుంది
0 comments:
Post a Comment