రివ్యూ: హృదయ కాలేయం
సినీ దునియా రేటింగ్: 2/5
బ్యానర్ : అమృత క్రియేషన్స్
తారాగణం : సంపూర్నేష్ బాబు ,కావ్య కుమార్ తదితరులు
దర్శకత్వం : స్టీవెన్ శంకర్
నిర్మాత : సాయి రాజేష్
సోషల్ మీడియా హీరో సంపూర్నేష్ బాబు హీరో గా నటించిన హృదయ కాలేయం సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది . విడుదలకు ముందే యు ట్యూబ్ లో సంచలనాలు సృష్టించిన ఈ సినిమా లో అందరి దృష్టి సంపూర్నేష్ బాబు పైనే ఉంది .కథ లోకి వెళ్తే హీరో ఒక చిల్లర దొంగ. తను దొంగ గా మారడానికి ముందు నీలు అనే అమ్మాయి ని ప్రేమిస్తాడు . నీలు కూడా హీరో ని ప్రేమిస్తుంది . అనంతరం నీలు ఒక సమస్య లో చిక్కుకుంటుంది . ఆ సమస్య నుండి నీలు ని బయట పడేయడానికి హీరో దొంగ గా మారాల్సి వస్తుంది . హీరో దొంగతనాలు చేస్తూ పోలీస్ లకు సవాలుగా మిగులుతాడు . చివరికి పోలీస్ లు సంపు ని పట్టుకుంటారు . హీరో ని చూసిన పోలీస్ కమీషనర్ మీరు దొంగ గ మారడం ఎంటని ఆశ్చర్య పోతాడు . హీరో దొంగ గా ఎలా మారాడు ,నీలు ని ఎలా రక్షించాడు అన్నదే కథ .
సోషల్ మీడియా హీరో సంపూ తన స్థాయి లో బాగానే నటించాడు హృదయ కాలేయం సినిమాలో హీరో ది వన్ మాన్ షో . సినిమా లో సంపూ చెప్పే డైలాగ్ లు , కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి ..హృదయ కాలేయం ఒక ప్రత్యెక చిత్రం కావడం తో హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా సంపూర్నేష్ బాబు నటన తన సోషల్ మీడియా అభిమానులకు నచ్చుతుంది .హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఒక హీరో తోలి సినిమా కి ఇంత పాపులారిటి రావడం బహుశ ఇదే మొదటి సారి కావచ్చు
0 comments:
Post a Comment